Naatu Naatu Song: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాంగ్ గురించి ఈ వార్త నిజమేనా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి ఆగష్టు నెలలో విడుదలైన దోస్తీ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా దోస్తీ సాంగ్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పై ప్రేక్షకులు పెంచుకున్న అంచనాలకు తగిన స్థాయిలో లేదని కామెంట్లు వినిపించాయి. మొదటి పాట అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమా నుంచి రెండో పాటగా నాటు నాటు సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, చరణ్ ప్రోమోలో వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నాటు నాటు సాంగ్ ప్రోమోను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ గురించి కాపీ ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాహుబలి సిరీస్ లోని చాలా సీన్లను జక్కన్న హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారని కామెంట్లు వినిపించాయి. అయితే ఈ ఆరోపణల గురించి జక్కన్న గతంలో స్పందించలేదు. నాటు నాటు సాంగ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. అయితే ఆఫ్రికన్ సాంగ్ లోని స్టెప్పులే ఈ సాంగ్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

masaka kids africana dancing పేరుతో ఉండే వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ పాటలోనిస్టెప్పులను సాంగ్ లో కాపీ కొట్టారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్ లో ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus