‘ఆర్.ఆర్.ఆర్’ లో జూ.ఎన్టీఆర్ లుక్ పై క్లారిటీ!

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగెర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్ – చల్ చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ భారీగా ఒళ్ళు చేసిన ఒక పిక్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే .

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని.. అందుకే ఇలా లావయ్యాడంటూ గుసగుసలు వినిపించాయి. అయితే ఆ వార్తలకి చెక్ పెడుతూ.. ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ క్లారిటీ ఇచ్చాడు. ఈ పిక్ ఏడాది క్రితం తీసిందని.. ఎన్టీఆర్ లుక్ ఇది కాదంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని డిసెంబర్ 12న ప్రకటించబోతున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus