మెగానందమూరి ఫ్యాన్స్ కు పండగే: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!

  • November 29, 2021 / 04:27 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలో పాటలను, టీజర్లకు విడుదల చేస్తూ హడావిడి చేస్తున్నారు. రీసెంట్ గా ‘జనని’ సాంగ్ విడుదలైనప్పుడు.. డిసెంబర్ తొలివారం ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని రాజమౌళి చెప్పారు.

ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ను, వెన్యూని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 3న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల కానుంది. ముంబైలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ కారణంగానే ఇటీవల రాజమౌళి.. సల్మాన్ ని కలిశారని సమాచారం. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ట్రైలర్ ను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి జంటగా.. ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో అలియాభట్ కనిపించనుంది. అలానే అజయ్ దేవగన్, శ్రియాశరన్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus