F3 Movie: ‘ఎఫ్3’ కూడా సంక్రాంతికే.. ఒకేసారి ఇద్దరు మెగా హీరోల సినిమాలా..!

అక్టోబర్ నెలలో ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే ప్రసక్తే లేదని చాలా రోజుల నుండీ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఇది నిజమే అని చెప్పుకొస్తున్నారు. అన్నీ కుదిరితే 2022 సంక్రాంతికే ఈ చిత్రం విడుదలవుతుంది అని వారు హింట్ ఇచ్చారు. నిజానికి సంక్రాంతి సీజన్ కు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడం మంచిదే..! అయితే పోటీగా ఏ సినిమా విడుదలైనా ప్రేక్షకులు పట్టించుకుంటారు అన్న గ్యారెంటీ లేదు.

కానీ ‘ఎఫ్3’ చిత్రం కూడా ఆ టైంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనేది తాజా సమాచారం. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి ఆగష్టులో విడుదల కావాల్సిన ‘ఎఫ్3′(‘ఎఫ్2’ సీక్వెల్) చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతికి పోన్ చెయ్యాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. అయితే మరీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు పోటీగా అయితే కాదు..! 2022 జనవరి 8వ తేదీ ఆ టైంకి ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి ఓ 5 రోజుల తరువాత అంటే జనవరి 13న ‘ఎఫ్3’ ని దింపాలని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.

అంటే సంక్రాంతికి ఒక్క రోజు ముందు ‘ఎఫ్3’ విడుదల కాబోతుంది అన్న మాట. సంక్రాంతి టైం లో 4,5 బ్లాక్ బస్టర్లను తట్టుకునే శక్తి బాక్సాఫీస్ కు ఉంటుంది ఇది పెద్ద ప్రాబ్లం కాదు. 2019 లో రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ , వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ సినిమాలు కూడా ఒకే టైములో విడుదలైన సంగతి తెలిసిందే. 3 ఏళ్ళ తరువాత మళ్ళీ వీళ్ళ సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయన్న మాట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus