స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి బాహుబలి 2 సినిమా వరకు వరుస విజయాలు సాధించి రికార్డులను క్రియేట్ చేస్తున్న రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, తారక్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ పరంగా ఇప్పటికే కొత్త రికార్డులను క్రియేట్ చేయగా థియేట్రికల్ రైట్స్ పరంగా కూడా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చరణ్, తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీకే ఈ సినిమా రిలీజవుతుందని రాజమౌళి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా క్రియేట్ చేస్తున్న కొత్త రికార్డులను హరిహర వీరమల్లు సినిమా చెరిపేస్తుందని అభిప్రాయపడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ తో మగధీర సినిమాను తెరకెక్కించి రాజమౌళి కొత్త రికార్డులను క్రియేట్ చేయగా అత్తారింటికి దారేది సినిమా ఆ మూవీ రికార్డులను బ్రేక్ చేసిందని
అదే విధంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సమయానికి ఈ మూవీ రిలీజవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. హరిహర వీరమల్లు విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోస్యం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!