ఏపీలో టికెట్ రేట్లు పెంచక పోవడం వల్ల టాలీవుడ్ నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారనే సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో టికెట్ రేట్లు చాలా తక్కువ మొత్తం కావడం గమనార్హం. టికెట్ రేట్లు పెంచకపోతే పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పవని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ సినిమాలతో ప్రూవ్ అయింది. ఆర్ఆర్ఆర్ మేకర్స్ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు. అయితే త్వరలో ఏపీ సీఎం జగన్ ను కలిసి తమ పరిస్థితిని తెలియజేస్తామని దానయ్య పేర్కొన్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్య త్వరలో సీఎం జగన్ ను కలిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ టికెట్ రేటును పెంచడానికి జగన్ ఓకే చెప్పే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇతర సినిమాలకు కూడా అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చరణ్, ఎన్టీఆర్ టికెట్ రేట్లను పెంచాలని కోరితే జగన్ ఏమంటారో చూడాల్సి ఉంది. ఏపీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సైతం టికెట్ రేట్లను పెంచాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ పై ఊహించని స్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!