Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Advertisement

ఏ టెక్నాలజీ లేనప్పుడు.. సరైన ఎక్విప్‌మెంట్‌లు లేనప్పుడే మార్ఫింగ్‌లు, ఫొటోషాప్‌లు పట్టుకుని తెగ హడావుడి చేసేసేవారు కొంతమంది కేటుగాళ్లు. హీరోయిన్ల ఫొటోలను మార్చేసి.. ఒకరికొకరు షేర్‌ చేసుకొని అదేదో రకం ఆనందాన్ని పొందేవారు. అలాంటిది ఇప్పుడు మనసులో ఆలోచనను చెబితే చాలు మార్పులు, చేర్పులు చేసేసే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వచ్చేసింది. దీంతో వారందరికీ రెక్కలు వచ్చినట్లు అయింది. ఈ క్రమంలో కొత్త నేషనల్‌ క్రష్‌ రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth) ఫొటోలను మార్చేసి వైరల్‌ చేసేశారు.

Rukmini Vasanth

స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ జరిగిన రుక్మిణి వసంత్‌ ఫొటో షూట్‌ ఫొటోలు అంటూ కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫొటోలు, వీడియోలు ఫేక్‌ అని రుక్మిణి వసంత్‌ స్పష్టం చేసింది. తన ఫొటోలను ఏఐతో అసభ్యకర రీతిలో క్రియేట్‌ చేసి అలా పోస్ట్‌ చేయడం బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తన ప్రైవసీని ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నాను అని కూడా చెప్పింది.

ఏఐతో క్రియేట్‌ చేసిన నా ఫొటోలు వైరల్‌ అవ్వడం నేను, నా టీమ్‌ గుర్తించాం. అవన్నీ ఫేక్‌. ఏఐతో చేసినవి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫొటోలను క్రియేట్‌ చేసిన వారితో పాటు, వైరల్‌ చేస్తున్న వారిపై సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ ద్వారా చర్యలు తీసుకునేలా చేస్తాం. ఇలాంటి కంటెంట్‌, ఫొటోలను వైరల్‌ చేయడం, షేర్‌ చేయడం మానుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని రుక్మిణి వసంత్‌ తన పోస్టులో రాసుకొచ్చింది.

నిజానికి ఇలాంటి ఫేక్‌ ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతుండటం హీరోయిన్లకు తలనొప్పిగా మారింది. గత కొన్ని రోజులుగా కథానాయికలు, నటీమణులు, యాంకర్‌లకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో ఇలా కనిపిస్తున్నాయి. అవి ఏఐ ఫొటోలు అంటూ సదరు వ్యక్తులు చెబితే తప్ప తెలిసే పరిస్థితి లేదు. దీంతో ఇలాంటి విషయాల్లో పోలీసులు, వ్యవస్థ సీరియస్‌గా దృష్టి పెట్టాల్సి ఉంది.

కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus