Trivikram: ట్రయాంగిల్‌ స్టోరీలో ఇద్దరు ఓకే చేసుకున్నారు మరి

ఒక సినిమా రద్దు ఆ సినిమా టీమ్‌ మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ సినిమా రద్దు ముగ్గురు హీరోలు, ఇద్దరు దర్శకుల మీద ప్రభావం చూపిస్తే… అది కచ్చితంగా #ఎన్టీఆర్‌ 30 అనే చెప్పాలి. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలయికలో రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల రద్దు అయిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు హీరోల డేట్స్‌ ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. ఇద్దరు దర్శకుల ప్లాన్స్‌ మొత్తం మారే పరిస్థితి. అయితే అందులో ఒక దర్శకుడి క్లారిటీ ఇచ్చేశాడు, ఇంకొకాయన ఇవ్వాలి.

ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా రద్దు అని చాలా రోజుల నుండి వార్తలొచ్చినా.. ఇటీవల కొరటాలతో సినిమా ఉంటుందని ప్రకటించేసరికి ఫుల్‌ క్లారిటీ వచ్చింది. అలా ఆ ఇద్దరూ తమ నెక్స్ట్‌ చెప్పేశారు. కొరటాల ఇటు వచ్చేసరికి అల్లు అర్జున్‌ పరిస్థితి ఏంటి, గతంలో ప్రకటించి #AA19 ఉంటుందా అనే అనుమానాలు రాగా, ఆ సినిమా నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్‌ ‘తప్పక ఉంటుంది’ అని ప్రకటించి క్లారిటీ ఇచ్చేసింది. ఈలోగా బన్నీ… ‘ఐకాన్‌’ పూర్తి చేస్తాడని అంటున్నారు. దీంతో ఇక క్లారిటీ & కన్ఫర్మేషన్‌ రావాల్సింది త్రివిక్రమ్‌ గురించే.

ఎన్టీఆర్‌ సినిమా ఉండటంతో కొత్త సినిమా ప్రారంభించకపోయినా తర్వాత అది ఉందిలే అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా లేదు. దీంతో మహేష్‌ సినిమా అంటున్నారు. అయితే దీనిపై బలమైన పుకార్లు రావడం లేదు. అలాగే క్లారిటీ కూడా రావడం లేదు. త్వరలో ప్రకటిస్తాడు అంటున్నారు కానీ ప్రకటించడం లేదు. పక్కాగా ఉండుంటే.. ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా ప్రకటించిన రోజే దీని ప్రకటనా రావాల్సింది. దీంతో త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి అని అందరూ ఎదురుచూస్తున్నారు. మహేష్‌ సినిమా ఓకే చేసుకుంటాడా? లేక కొత్త సినిమా లైన్లో పెడతాడా అనేది చూడాలి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus