Prashanth Neel, Ram Charan: చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా.. ట్విస్ట్ ఏంటంటే?

  • December 25, 2023 / 08:35 PM IST

సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. సలార్2 మొదట మొదలవుతుందా? లేక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదట మొదలవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. చరణ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. చిరంజీవి, చరణ్ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ సినిమా సినిమాకు పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కుటుంబం కంటే సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి కాన్సెప్ట్ లతో తెరకెక్కుతాయో తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో సైతం సలార్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ప్రభాస్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ కలెక్షన్లను సాధిస్తుండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రశాంత్ నీల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ లు ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. ప్రభాస్ లైనప్ అదుర్స్ అనేలా ఉండగా ప్రశాంత్ నీల్ లైనప్ కూడా బాగుంది. సలార్2 సినిమా కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్, ప్రశాంత్ నీల్ రేంజ్ పెరుగుతోంది. సలార్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus