RRR Movie: ఆర్ఆర్ఆర్ రూమర్స్ లో అసలు నిజం ఇదే!

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 18 రోజుల సమయం మాత్రమే ఉంది. ఓవర్సీస్ లో తారక్ అభిమాని ఒకరు ఏకంగా 75 ఆర్ఆర్ఆర్ టికెట్లను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. చరణ్ అభిమానులు కూడా ఈ సినిమా టికెట్లను భారీస్థాయిలో కొనుగోలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం క్లైమాక్స్ లో ఒక హీరో పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను విన్న అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇద్దరు హీరోలలో ఒక హీరోను ఒక విధంగా మరో హీరోను మరోలా చూపిస్తే రిజల్ట్ పై ప్రభావం పడుతుందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వైరల్ అయిన వార్తలో ఏ మాత్రం నిజం లేదు.

క్లైమాక్స్ లో ఇద్దరు హీరోల పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుందని హ్యాపీ ఎండింగ్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తొలిరోజు కలెక్షన్లు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరకడం తేలిక కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయగా విడుదలైన తర్వాత ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు నగరాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు గ్రాండ్ గా జరగనున్నాయని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెరగనుందని సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus