ప్రభాస్ ను టెన్షన్ పెడుతున్న ‘సాహో’ రన్ టైం..!

‘సాహో’ చిత్రం వచ్చే నెల అంటే ఆగష్టు 15 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు దాదాపు 2 ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం కూడా ఈ చిత్రం అంచనాలు భారీ ఎత్తున ఏర్పడ్డాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా ‘సాహో’ ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘సాహో’ చిత్రానికి ఇప్పుడు ఓ సమస్య వచ్చిపడిందట.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. నిడివి పరంగా… 1 గంట ఇరవై నిముషాలు పైనే వచ్చిందట. అది కూడా పోస్ట్ ఇంటర్వెల్ పార్ట్ అవ్వకుండానే ఇంత నిడివి వచ్చిందట. ఇక సినిమా మొత్తం పూర్తయ్యేసరికి 2 గంటల 50 నిమిషాలు దాటేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చర్చలు జరుపుకుంటున్నారట. ‘అంత నిడివి అయితే కష్టమైపోతుంది.. కాబట్టి కొంచెం నిడివి తగ్గించే ప్రయత్నం చేయమని’ హీరో ప్రభాస్.. దర్శకుడు సుజీత్ కు అలాగే నిర్మాతలు వంశీ, ప్రమోద్ లకు చెప్పాడట. అలా అయితే కనెక్టివిటీ లోపించి అవకాశం ఉందని వారు చెప్తుండడంతో ప్రభాస్.. తల పట్టుకుంటున్నాడట. ఇక ఏ విధంగా చూసినా ‘సాహో’ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి దాటేసే అవకాశం ఉందట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus