అసలే హిట్లు లేవు.. ‘సాహో’ తో రిస్క్ అవసరమా.. సూర్యా?

  • July 24, 2019 / 06:24 PM IST

ప్రభాస్ ‘సాహో’ చిత్రం చాలా సినిమాలను ఇబ్బందులకు గురిచేస్తుంది. మొదట ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘సాహో’ కొన్ని కారణాల వలన ఆగష్టు 30 కి మారింది. అప్పటికే ఈ చిత్రం కోసం మిగిలిన సినిమాలు.. రిలీజ్ డేట్లు మారాయి. మరోసారి ‘సాహో’ రిలీజ్ డేట్ మారడంతో.. ఇప్పటికే రిలీజ్ డేట్ మార్చుకున్న మిగిలిన సినిమాలు ఇప్పుడు మరోసారి వాయిదా పడటం తప్పడం లేదు. అయితే ‘సాహో’ చిత్రానికి ముందు వస్తే కరెక్టా లేక వెనుక వస్తే కరెక్టా అని మిగిలిన చిత్ర యూనిట్లు సతమతమవుతున్నాయి.

ఈ లిస్ట్ లో నాని ‘గ్యాంగ్ లీడర్’.. వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రాలతో పాటు కోలీవుడ్ హీరో సూర్య ‘కాప్పన్‌’ (తెలుగులో బందోబస్త్) కూడా ఉంది. సూర్య ‘బందోబస్త్’ ను మొదట ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు కానీ ‘సాహో’ కోసం ఆగస్టు 30కి మార్చారు. ఇప్పుడు ‘సాహో’ కూడా అదే డేట్‌కి వస్తుంది కాబట్టి మరో రిలీజ్ డేట్‌ కోసం చూస్తున్నారట. కానీ నిర్మాతలు మాత్రం ఆగస్టు 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సూర్యతో పాటు మోహన్‌లాల్‌, ఆర్య లాంటి స్టార్స్‌ ఉండటంతో ‘సాహో’ తో పోటి పడినా మంచి వసూళ్ళు వస్తాయని వారు చెబుతున్నరట. కానీ ‘యూవీ క్రియేషన్స్’ లాంటి పెద్ద సంస్థ.. అందులోనూ నైజాం లాంటి ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ‘బందోబస్త్’ కు థియేటర్లు దొరకడం కష్టమనే చెప్పాలి. అయినా కాదని ‘బందోబస్త్’ ను విడుదల చేస్తే సూర్య పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. అసలే హిట్లు లేవు.. ఈ టైములో రిస్క్ అవసరమా… సూర్యా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus