‘పుష్ప’ టీం పెద్ద స్కెచ్ వేశారుగా…!

Advertisement

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘పుష్ప’. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కథతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రం కాబట్టి ‘పుష్ప’ కు ఆ స్థాయిలో క్రేజ్ ఏర్పడాలని పరభాషా నటీనటులను కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ నటుడు ధనుంజయ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

విజయ్ సేతుపతిని కూడా తీసుకున్నారు కానీ… తరువాత కొన్ని కారణాల వలన ఆయన తప్పుకున్నాడు.ఇక గ్లామర్ విషయంలో కూడా ‘పుష్ప’ టీం వెనుకడుగు వెయ్యడం లేదు. ఇప్పటికే హీరోయిన్ గా రష్మిక మందనను ఫైనల్ చేసారు. ఇక స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ‘సాహో’ హీరోయిన్ నే తీసుకోబోతున్నారట.

అవును ‘పుష్ప’ చిత్రంలో శ్రద్దా కపూర్ ను ఓ స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తున్నట్టు వినికిడి. ఒకవేళ శ్రద్దా కనుక ఒప్పుకోకపోతే ఊర్వశి రౌటెలాను ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలే దర్శకుడు సుకుమార్… ఐటెం సాంగ్స్ విషయంలో అస్సలు తగ్గడు అన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news