సుజీత్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనే..!

  • November 18, 2019 / 12:52 PM IST

సాధారణంగా ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కుర్ర దర్శకులకి త్వరగా రాదు. రెండు,మూడు బ్లాక్ బస్టర్లు ఇస్తేనే ఆ అవకాశం దక్కుతుంది. అలాంటిది సుజీత్ ఒక్క హిట్ కొట్టగానే ఆ అవకాశం దక్కించుకున్నాడు. ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అది కూడా బాహుబలి లాంటి సినిమా తరువాత..! అసలు ఇంత గొప్ప ఛాన్స్ మరే దర్శకుడికీ వచ్చి ఉండదు. సినిమాకి టాక్ బాలేకపోయిన వసూళ్ళు మాత్రం ఓరేంజ్లో వచ్చాయి. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయంలో మాత్రం సుజీత్ తడబడ్డాడు అనే చెప్పాలి.

భారీ బడ్జెట్ అనడంతో కంగారు పడ్డాడో ఏమో కానీ.. ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అభిమానులు రెండో సారి సినిమా చూస్తేనే కానీ అర్థం చేసుకోలేనంతగా ‘సాహో’ ని తీర్చిదిద్దాడు. అయితే ఈ చిత్రం విడుదలయ్యాక.. ఈ కుర్ర డైరెక్టర్ ఎక్కువగా కనిపించలేదు. ఇక తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేయలేదు. అయితే కొంచెం గ్యాప్ తీసుకున్న సుజీత్ తన నెక్స్ట్ సినిమాకి హీరోని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం తన మొదటి సినిమా అయిన ‘రన్ రాజా రన్’ హీరో శర్వానంద్ తోనే తన మూడవ సినిమా కూడా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus