సాక్ష్యం మూడు రోజుల కలక్షన్స్

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “సాక్ష్యం”. చిన్న హీరో అని చూడకుండా 40 కోట్లు ఖర్చు పెట్టి అభిషేక్‌ నామా గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్‌ అయి మంచి టాక్ అందుకుంది. సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు పంచభూతాలు సాక్ష్యాలే అనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. మల్టీఫ్లెక్స్ లో ఈ మూవీకి కలక్షన్స్ తక్కువగా ఉన్నప్పటికీ బీ, సీ సెంటర్లలలో థియేటర్లు నిండిపోతున్నాయి. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాక్ష్యం ఫస్ట్ వీకెండ్ (మూడు రోజుల్లో) 7.06 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 2.25 కోట్లు
సీడెడ్ : 1.40 కోట్లు ఉత్తరాంధ్ర : 1.00 కోటి
గుంటూరు : 81 లక్షలు కృష్ణ : 50 లక్షలు
ఈస్ట్ గోదావరి : 49 లక్షలు
వెస్ట్ గోదావరి : 37 లక్షలు నెల్లూరు : 24 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో : 7.06 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus