హీరోగా “క్రికెట్ గాడ్”!!!

క్రికెట్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు ఏంటి అంటే “సచిన్ టెండుల్కర్”. బహుశా ప్రతీ క్రికెట్ అభిమాని సచిన్ క్రికెట్ గాడ్ అంటే ఒప్పుకోక తప్పదు. ఇదిలా ఉంటే క్రికెట్ మైదానంలో తనదైన శైలిలో బాట్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే సచిన్ చిత్ర సీమలో తెరపై కనిపిస్తే, తనదైన శైలిలో గర్జిస్తె ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది కదా, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఈ కధ చూడండి…మాస్టర్ బ్లాష్టర్ సచిన్ టెండుల్కర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆయన చరిత్రను తెలియజేయడానికి ఓ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం బయోపిక్ లు భారీగా నడుస్తున్న క్రమంలో టాప్ క్రికెటర్స్ అయినటువంటి ధోని, అజార్ పైన కూడా ఈ బయోపిక్ లు వస్తున్నాయి. అయితే వారి బయోపిక్ లతో పోలిస్తే సచిన్ బయోపిక్ కొంచెం డిఫరెంట్ ఎందుకంటే, సచిన్.. ఎ బిలియన్ డ్రీమ్స్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సచిన్ తన పాత్రను తనే చేస్తున్నాడు. నిజంగా అద్భుతం అనే చెప్పాలి, ఎందుకంటే ఒక క్రికెటర్ తన బయోపిక్ లో తనే నటించడం అంటే బహుశా ఆవకాశం మరెవ్వరికీ రాదేమో. ఇక సినిమా పూర్తిగా సచిన్ క్రికెట్ కరియర్ పైనే రన్ అవుతుంది. సినిమాలో ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. పూర్తిగా మాసిపోయిన ఓ ప్యాంట్ ప్యాడ్స్ కట్టుకుని వస్తున్న సచిన్ కనిపిస్తాడు. 55 రోజుల పాటు ట్రైనింగ్ ఒక జత ట్రౌజర్స్.. ఇదీ సచిన్ స్టోరీ.. అంటూ రాసిన డిస్క్రిప్షన్ ఆకట్టుకుంటుంది. సినిమా విషయాలపై సచిన్ వివరాలు తన ట్వీట్ ద్వారా తెలిపాడు, సచిన్ ట్వీట్ చేస్తూ…ఏప్రిల్ 14న ఈ మూవీకి టీజర్ విడుదల చేయబోతున్నారు అంటూ అభిమానులకు సర్ప్రైస్ ఇచ్చాడు. ఇక సచిన్ ట్వీట్ ను ప్రముఖులు అందరూ రీ ట్వీట్స్ చేస్తూ సచిన్ కు విషస్ పంపుతున్నారు. ఏది ఏమైనా..ఈ సినిమా సూపర్ హిట్ కావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus