Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఏడుపులు..! హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!

  • September 28, 2023 / 11:00 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏటిఏం టాస్క్ నడుస్తోంది. పవర్ అస్త్రాని సంపాదించడం కోసం మిగిలిన హౌస్ మేట్స్ నానా తంటాలు పడుతున్నారు. ఫోటో స్మైల్ టాస్క్ లో గెలిచిన అమర్ దీప్ , గౌతమ్ ఇద్దరూ కూడా అందరికంటే ఎక్కువ క్వాయిన్స్ సంపాదించి రేసులో ముందు ఉన్నారు. అయితే, రెండోసారి ప్రిన్స్ యావర్ ఫాస్ట్ గా వెళ్లి బజర్ ప్రెస్ చేశాడు. ప్రిన్స్ యావార్ తనకి పార్ట్ నర్ గా పల్లవి ప్రశాంత్ ని ఎంచుకున్నాడు.

అమర్ ఇంకా గౌతమ్ ఇద్దరినీ అపోనెంట్స్ గా తీసుకున్నాడు. దీంతో బిగ్ బాస్ రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. గ్లాస్ ఈజ్ షాట్, ఫిల్ ఇట్ ఫాస్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పబ్స్ లో తాగే షార్ట్స్ లాంటి గ్లాసులు ఇచ్చి అందులో కన్నీళ్లని నింపమని చెప్పాడు. ఇక హౌస్ లో ఏడుపులు మొదలుపెట్టారు నలుగురు కంటెస్టెంట్స్. ముఖ్యంగా అమర్, ప్రిన్స్ కిచెన్ లో ఉల్లిపాయలు, నిమ్మకాయలు తెచ్చుకుని కళ్లలో పిండుకుని కన్నీళ్లు తెప్పించుకునే ప్రయత్నం చేశారు.

కానీ, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేసరికి ఆగిపోయారు. ఆ తర్వాత ఈ గేమ్ ని కాసేపు పాజ్ చేశాడు బిగ్ బాస్. తర్వాత మళ్లీ కొనసాగించాడు. ఫైనల్ గా ప్రిన్స్ యావార్, పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడా అమర్ – గౌతమ్ ల కంటే కూడా కొద్దిగా ఎక్కువగా నింపారు. దీంతో వాళ్లు విజేతలుగా నిలిచారు. అంతేకాదు, ఈ టాస్క్ లో గెలిచి అందరికంటే కూడా ఎక్కువ క్వాయిన్స్ ని సంపాదించారు.

దీంతో నలుగురు జీరో లతో లాకర్స్ ని మైయిన్ టైన్ చేస్తున్నారు. రతిక, టేస్టీతేజ, అమర్, ఇంకా గౌతమ్ నలుగురు కూడా సున్నాతో ఉన్నారు. బిగ్ బాస్ మరోసారి హౌస్ మేట్స్ కి ఆఫర్ ఇచ్చాడు. ర్యాంప్ వాక్ లో ఎవరైతే బాగా జడ్జిని ఇంప్రెస్ చేస్తారో వారికి ఎక్కువ మార్కులు వస్తాయని, వారికి కొన్ని క్వాయిన్స్ ఇచ్చి మూడో కంటెండర్ గా అయ్యే అవకాశం ఇస్తామని చెప్పాడు.

దీంతో హౌస్ మేట్స్ ఉత్సాహంగా ర్యాంప్ వాక్ లో పార్టిసిపేట్ చేశారు. మరి వీరిలో ఎవరు విజేతగా నిలిచారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన చివరి ట్విస్ట్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. అలాగే, ఈ టాస్క్ లో రెండు వారాల ఇమ్యూనిటీ ఎవరు గెలిచారు. పవర్ అస్త్రాని ఎవరు దక్కించుకున్నారో శనివారం (Bigg Boss 7 Telugu) ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున చెప్తారు. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus