మెగా హీరోది రియల్ ఎస్టేట్ వ్యాపారమట!

“సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్” సినిమాల విజయాలతో మాంచి ఫామ్ లో ఉన్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం “తిక్క”. “ఓమ్” ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టిపికల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో హీరో ఫాదర్ గా నటిస్తుండగా.. అలీ-ముమైత్ ఖాన్ ల కాంబినేషన్ సీన్స్ “తిక్క” సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పుకొంటున్నారు.

అలాగే.. సాయిధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంలో కాస్త టిపికల్ రోల్ ప్లే చేశాడట. సాయి ఈ సినిమాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కనిపించనున్నాడని సమాచారం. లారిస్సా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఫరా హాకీమీ ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ చేసింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus