ఆ గుణాలు నాలో మరింత బాధ్యతని పెంచాయి : సాయి ధరమ్ తేజ్

పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాతోబోల్తా కొట్టారు. అప్పటి నుంచి హిట్ ట్రాక్ లోకి రావాలని ఎంత ప్రయత్నిస్తున్నా రాలేకపోతున్నారు. విన్నర్,  నక్షత్రం, జవాన్ చిత్రాలు కూడా నిరాశపరిచాయి. వివి వినాయక్ కూడా సాయి ధరమ్ తేజ్ కి హిట్ ఇవ్వలేకపోయారు. “ఇంటెలిజెంట్‌” కూడా ఫెయిల్ కావడంతో సాయి ధరమ్ తేజ్ పై ఒత్తిడి పడింది. ఎలాగైనా హిట్ కొట్టాలని కరుణాకరన్ తో కలిసి “తేజ్ ఐలవ్యూ” అనే సినిమాని చేసారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వచ్చే నెల ఆరోతేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. తాజాగా విశాఖపట్నంలో ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్  నిర్వహించారు.

ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ”గతంలో ఓ ఆడియో వేడుకకు విశాఖ వచ్చాను. అప్పుడు గురజాడ కళాక్షేత్రంలో జరిగింది. ఇప్పుడు `తేజ్ ఐలవ్యూ` ఆడియో ఫంక్షన్‌ కూడా గురజాడ కళాక్షేత్రంలోను నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇక నాలో మెగాస్టార్‌ చిరంజీవి హావభావాలు, బాడీ లాంగ్వేజీ ఉన్నాయని పలువురు అంటుంటారు. అది నా అదృష్టం. అయితే అది నాకు మరింత బాధ్యత పెంచుతోంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించాలి. నా డ్యాన్స్‌, డైలాగ్‌ డెలివరీ, యాక్టింగ్‌ మరింత బాగా రావాలని శ్రమిస్తున్నాను” అని తేజ్ అన్నారు. సొంత పేరుతో తెరకెక్కిన ఈ మూవీపైనే సాయిధరమ్ తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus