కళ్యాణ్ రామ్ తో మెగా హీరో మల్టీ స్టారర్ మూవీ..!!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఆడో రకం, ఈడో రకం వంటి మల్టీ స్టారర్ సినిమాలు హిట్ సాధించడంతో ఆ దిశగా యువహీరోలు అడుగులేస్తున్నారు. స్క్రిప్ట్ నచ్చితే సైన్ చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ క్రేజీ కాంబినేషన్ ని కలిపిన డైరక్టర్ ఏ.ఎస్.రవికుమార్ చౌదరి. గతంలో “పిల్లా నువ్వులేని జీవితం” ఫిల్మ్ ని తెరకెక్కించిన ఈ డైరక్టర్ సాయి ధరమ్ తేజ్ ని మరోసారి డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మించనున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో తేజ కీలక రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ పూరి దర్శకత్వంలో ఇజం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ కి తమ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత రవికుమార్ చౌదరీ సినిమాలో నటిస్తారని చిత్ర బృందం వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus