ఖరారు అయిన వివి వినాయక్, సాయిధరమ్ తేజ్ మూవీ టైటిల్

పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత చేసిన తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు నిరాశ పరిచాయి. బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ కూడా ఆశించినంత హిట్ సాధించలేకపోయింది. దీంతో ఆశలన్నీ వివి వినాయక్ పై పెట్టుకున్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాకు “ధర్మాభాయ్‌” అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పేరు ఎవరికీ నచ్చకపోవడంతో “ఇంటెలిజెంట్‌” అనే పేరు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ”ఈ చిత్రానికి సంబంధించిన మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. జనవరి 17తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.” అని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus