Sai Durgha Tej: మళ్ళీ పేరు మార్చుకున్నాడు… కొత్త పేరేంటో తెలుసా?

  • March 9, 2024 / 12:21 PM IST

నిన్న ఉమెన్స్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన ‘సత్య’ అనే షార్ట్ ఫిలిం ప్రీమియర్ ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించడం జరిగింది. సీనియర్ (Naresh) నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫిలిం ఇది. సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి (Colours Swathi) జంటగా నటించిన ఈ షార్ట్ ఫిలింని.. ‘బలగం’  (Balagam) నిర్మాతలు అయిన (Harshith Reddy) హర్షిత్ రెడ్డి, (Hanshitha Reddy) హన్షిత రెడ్డి లు నిర్మించారు. కుటుంబం కోసం ధైర్యం నిలబడే మహిళ గురించి, దేశం కోసం బలంగా నిలబడే సైనికుడి గురించి ఈ షార్ట్ ఫిలింలో చాలా గొప్పగా చూపించారు.

ప్రీమియర్ అనంతరం సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘ ఇక నుండి నా పేరులో మా అమ్మ పేరును కూడా చేర్చుకుంటున్నాను. నాన్న ఇంటి పేరు ఎలాగూ ఉంటుంది. మా అమ్మ ఎప్పటికీ నాతో పాటే ఉండాలి. అందుకే మా అమ్మ పేరు చేర్చుకొని నా పేరు (Sai Durgha Tej) ‘సాయి దుర్గ తేజ్’గా మార్చుకుంటున్నాను’ అని తెలియజేశాడు. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా తన పేరు అప్డేట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశాడు.

వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ అనే పేరును.. (Chitralahari) ‘చిత్రలహరి’ సినిమా టైంలో సాయి తేజ్ గా మార్చుకున్నాడు. అందులో ధరమ్ ని తీసేశాడు. కానీ ఎక్కడా కూడా దాన్ని అప్డేట్ చేసింది లేదు. ఇప్పుడు మరోసారి తన తల్లి పేరును జత చేసి మార్చుకున్నట్టు ప్రకటించాడు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus