Sai Dharam Tej: సాయితేజ్ దృష్టిలో పవన్ కళ్యాణ్ స్థానం ఇదే.. ఏం జరిగిందంటే?

  • November 15, 2023 / 08:20 PM IST

మెగా హీరో సాయితేజ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్న సాయితేజ్ తాజాగా నెటిజన్లతో ముచ్చటించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లి ఎప్పుడు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా మీ పెళ్లి అయిన వెంటనే అంటూ సాయితేజ్ ఫన్నీగా బదులిచ్చారు. చిరంజీవితో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్నకు ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని సాయితేజ్ అన్నారు.

మంచి కథ కుదిరితే రామ్ చరణ్ తో కలిసి నటించడానికి కూడా సిద్ధమేనని సాయితేజ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి గాంజా శంకర్ సినిమాలో మాత్రమే నటిస్తున్నానని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. మాస్ జానర్ సినిమాలు అంటే నాకు ఇష్టమని అవి నన్ను మీకు బాగా దగ్గర చేస్తాయని సాయితేజ్ తెలిపారు. ఆ జానర్ మూవీలో మరోసారి నటిస్తుండటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

నేను నటించిన సినిమాలలో చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాలు అంటే ఇష్టమని సాయితేజ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే గురువు అని సాయితేజ్ కామెంట్లు చేశారు. అన్ని రకాల సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని ఫ్యాన్స్ ప్రేమ, మద్దతుతో ఫ్యాన్స్ ను సంతోషంగా ఉంచడానికి మరింత ప్రయత్నిస్తానని సాయితేజ్ వెల్లడించారు. విరూపాక్ష పార్ట్2 ఎప్పుడనే ప్రశ్నకు శాసనాల గ్రంథం చూసి చెప్పాలని ఆయన అన్నారు.

షూటింగ్ సమయంలో సినిమా రిజల్ట్ గురించి ఆలోచించారా అనే ప్రశ్నకు ఆ సందేహం ఉంటే నా కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు ఉండేవి కావని ప్రతి సినిమాను ఇష్టపడి చేస్తామని దాన్నుంచి ఎంతో నేర్చుకుంటామని సాయితేజ్ కామెంట్లు చేశారు. సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. (Sai Dharam Tej) సాయితేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus