మామ చిరంజీవిపై భారం వేసిన సాయి ధరమ్ తేజ్

పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాలతో సాయి ధరమ్ తేజ్ మెగా హీరోగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత చేసిన తిక్క, విన్నర్, జవాన్ సినిమాలు నిరాశ పరిచాయి. గెస్ట్ రోల్ చేసిన నక్షత్రం కూడా అపజయం పాలయింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కావాలని మామ చిరంజీవిని నమ్ముకున్నారు. హిట్ కావడానికి చిరంజీవికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? .. అక్కడే ఉంది కిటుకు.. చిరు సినిమాలోని పాటలు రీమేక్ చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. మగధీరలో బంగారుకోడిపెట్ట సాంగ్ ని రీమేక్ చేసి రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే ‘వానా వానా వెల్లువాయే (రచ్చ)’, ‘శుభలేక రాసుకున్నా..(నాయక్)’ పాటలకు స్టెప్పులు వేసి చరణ్ విజయాలు సాధించారు.

ఈ పాట పెట్టు – హిట్టు కొట్టు అనే సెంటిమెంట్ సాయి ధరమ్ తేజ్ కి కూడా బాగా కలిసి వస్తోంది. రేయ్ సినిమాలో “గోలీమార్‌..” పాటకి స్టెప్పులు వేశారు. ఇది కొంత నిరాశపరిచింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో “గువ్వ గోరింక” పాట, సుప్రీమ్ “అందం హిందోళం” పాటలు రీమేక్ చేశారు. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. అప్పుడు మెగా అభిమానుల్లో కొంతమంది సాయి ధరమ్ తేజ్ ని విమర్శించడంతో ఆపేసాడు. కానీ అప్పటి నుంచి విజయాలు లేవు. సో ఈ సారి చిరు పాటని పెట్టాలని ఫిక్స్ అయ్యారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో “చమక్‌ చమకు ఛాం..” పాటను రీమేక్‌ చేయనున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సీకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2018 ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus