మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చానని , తనకు మంచి జీవితంతో పాటు , సినిమాల పరంగా కుడా తనను ముందుకు నడిపిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామికి కృతఙ్ఞతలు తెలుపుకున్నానని తెలిపాడు.
రోహిత్ కే పి డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ” సంబరాల ఏటిగట్టు ” మూవీ లో హీరోగా నటిస్తున్నారు సాయి దుర్గ తేజ్. ఈ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తున్నారు. అసలు అయితే దసరా కు రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. 2026 లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్లు టాక్.
2023 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామియో లో సాయి దుర్గ తేజ్ లీడ్ గా తెరకెక్కిన చిత్రం “బ్రో (BRO)”. ఈ చిత్రం ఫుల్ అంచనాలతో విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. “సంబరాల ఏటిగట్టు” మూవీ తో సాయి దుర్గ తేజ్ ను విజయం వరిస్తుందేమో చూడాలి.