సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ అదే!

“పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్” సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఇండస్ట్రీకి సరికొత్త “బ్యాంకబుల్ హీరోగా”గా మారిన సాయిధరమ్ తేజ్ తన తాజా చిత్రం కోసం ఓ ఎక్స్ పెరిమెంటల్ స్టోరీని సెలక్ట్ చేసుకొన్నాడు. రచయిత బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి “జవాన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం.

“కృష్ణగాడి వీరప్రేమగాధ”లో మహాలక్ష్మిగా అందర్నీ ఆకట్టుకొన్న మెహరీన్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో నిర్మాణం కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది. అయితే.. “జవాన్” అనగానే ఇదేదో మిలటరీ బేస్డ్ సినిమా అనుకోవద్దని దర్శకనిర్మాతలు సూచించారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus