సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘రిపబ్లిక్’. ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ప్రచారం కూడా షురూ చేశారు. ఓపక్క పాటల విడుదల కార్యక్రమం, మరోపక్క ఇంటర్వ్యూలు కూడా మొదలయ్యాయి. అయితే అంతలోనే సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగింది. దీంతో ‘రిపబ్లిక్’ సినిమా విడుదలపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఓ క్యాంపైన్ మొదలుపెట్టారు. కలెక్టర్లకు థాంక్స్ చెబుతూ వినూత్నంగా ఓ కార్యక్రమం అనుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అవ్వడంతో ఇప్పుడు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలను ఆపేశారు. ప్రస్తుతం హాస్పిటల్ లో సాయి తేజ్ సేఫ్ గానే ఉన్నపటికీ.. ఎన్నిరోజుల్లో ఆయన మీడియా ముంచుకొచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటారో చెప్పలేని పరిస్థితి. తాజాగా సాయి తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ డిశ్చార్జ్ చేసిన రెండు వారాల వరకు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ‘రిపబ్లిక్’ సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కానీ సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేయకుండా సినిమాను విడుదల చేయలేరు. హీరోకి బాలేనప్పుడు సినిమాను రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఈ సినిమా అనుకున్నట్లుగా అక్టోబర్ 1న వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!