Sai Dharam Tej: మెగా హీరోలు కాకుండా సాయితేజ్ కు ఇష్టమైన హీరోలు వీళ్లే!

మెగా హీరో సాయితేజ్ విరూపాక్ష సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నెటిజన్లతో ముచ్చటించిన సాయితేజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మే నెల 5వ తేదీన విరూపాక్ష మూవీ హిందీ వెర్షన్ ను రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సాయితేజ్ తెలిపారు. విరూపాక్ష సినిమాకు సీక్వెల్ ఉంటుందని విరూపాక్ష సినిమా క్లైమాక్స్ లోనే అందుకు సంబంధించి హింట్ ఇచ్చామని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

విరూపాక్ష సినిమాలో రాజీవ్ కనకాల రోల్ ను ఎందుకు చంపలేదనే ప్రశ్నకు స్పందిస్తూ చంపితే నువ్వు ఈ ప్రశ్న అడగవు కదా అంటూ సాయితేజ్ ఆసక్తికరంగా జవాబు ఇచ్చారు. తర్వాత సినిమా టైటిల్ లీక్ చేయాలని అడగగా లీక్ చేస్తే తేజు గారూ అంటూ నాకు కాల్ వస్తుందని సాయితేజ్ కామెంట్లు చేశారు. వినోదాయ సిత్తం కాకుండా జయంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో లవ్లీ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నానని సాయితేజ్ వెల్లడించారు.

ఒక నెటిజన్ సాయితేజ్ తో సినిమా చేయాలని ఉందని కోరగా మంచి కథతో వస్తే సినిమా చేయడానికి తాను సిద్ధమేనని సాయితేజ్ పేర్కొన్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఫేవరెట్ అని ఈతరం డైరెక్టర్లలో లోకేశ్ కనగరాజ్, మిత్రన్ ఫేవరెట్ డైరెక్టర్లు అని ఆయన తెలిపారు. చిరంజీవి గారితో కలిసి నటించడం నాకు ఇష్టమేనని ఆయన పిలిచినప్పుడు నటించడానికి సిద్ధమని సాయితేజ్ అన్నారు.

హీరోయిన్లలో సమంత క్రష్ అని సాయితేజ్ పేర్కొన్నారు. మెగా హీరోలు కాకుండా ప్రభాస్ అన్న, రవితేజ అంటే అభిమానమని ఆయన వెల్లడించారు. అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ్ ఇష్టమైన వంటలు అని చెప్పి సాయితేజ్ అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచారు. అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అనే ప్రశ్నకు స్పందిస్తూ పెళ్లిలో ఇన్ని ఆప్షన్లు ఉంటాయా అంటూ సాయితేజ్ సరదాగా కామెంట్లు చేశారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus