సాయి తేజ్ ఈసారి కూడా రాజీ పడక తప్పలేదు..!

సాయి తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ప్రతీరోజు పండగే’. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మారుతీ దర్శకుడు. సత్య రాజ్, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రాన్ని ‘యూ.వి. క్రియేషన్స్’ ‘జి.ఏ. పిక్చర్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే తమన్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈమధ్యే ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు కూడా అద్భుతమైన స్పందన లభించింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు.

అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు.. ‘ ‘ప్రతీరోజు పండగే’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది కదా. ఇలాంటి చిత్రాలు సంక్రాంతికి బాగా ఆడతాయి. ఇలాంటి సినిమాలు సంక్రాంతికే కరెక్ట్..! సాయి తేజ్ మార్కెట్ కూడా పెరుగుతుంది.’ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతికి అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా వస్తుంది కాబట్టి ఈ చిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేస్తున్నారు అని కొందరు భావిస్తున్నారు. అయితే మెగా హీరోల సినిమాలు ఒకే టైములో విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఏడాది చరణ్.. ‘వినయ విధేయ రామా’, వరుణ్ ల ‘ఎఫ్2’ వంటి చిత్రాలు సంక్రాంతికే విడుదలయ్యాయి. అయితే ఈసారి ‘ప్రతీరోజు పండగే’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఓకే బ్యానర్ నుండీ వస్తున్నాయి కాబట్టి ఇలా చేయక తప్పదు. అందుకే బన్నీ కోసం తేజు త్యాగం చేసి ముందుగా వచ్చేస్తున్నాడు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus