జర్నలిస్ట్ గా మారిన మెగా హీరో!

కెరీర్ మొదలెట్టినప్పట్నుంచి ఒక్కో సినిమాల్లో ఒక్కో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను పలకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకొన్న కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఇటీవల “తిక్క” సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ, ఆ ఫెయిల్యూర్ క్రెడిట్ దర్శకుడి ఖాతాలోకి చేరిపోవడంతో సాయిధరమ్ సేఫ్ అయిపోయాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “నక్షత్రం” చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న సాయి దాంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ నటిస్తున్నాడు. రకుల్ హీరోయిన్ గా కనువిందు చేయనున్న ఈ చిత్రంలో సాయిధరమ్ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ కావడంతో సాయి చుట్టూ ఎప్పుడూ అప్సరసల్లాంటి సుందరీమణులు తిరుగుతూ ఉంటారట. అందుకే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అని ప్రత్యేకంగా ఎవర్నీ తీసుకోలేదట. ఇకపోతే.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారని వినికిడి. ట్రెండీ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus