Sai Dharam Tej: షార్ట్ ఫిలిం ఏమైన వెబ్ సిరీస్ ఆ ఏంటి బ్రో ఇలా చేశారు అంటున్న ప్రేక్షకులు..

ఇండస్ట్రీ లోకి మెగా మేనల్లుడు గా అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్, మంచి ఎనెర్జిటిక్ హీరో గా, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది. ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే అలవోకగా చేసేయగల సత్తా ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్. అందుకే మెగా ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చాడు.

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సూపర్ హిట్స్ తో పాటుగా, డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు సాయి ధరమ్ తేజ్ కి పెద్ద గుణపాఠం నేర్పించింది. ఆ సినిమాల నుండి ఆయన తన స్క్రిప్ట్ సెలక్షన్ ని పూర్తిగా మార్చుకొని ‘చిత్రలహరి’ సినిమా నుండి సరికొత్త సాయి ధరమ్ తేజ్ ని ఇప్పుడు మనం చూస్తున్నాము. అయితే గత కొంత కాలం క్రితం బైక్ యాక్సిడెంట్ కి గురైన సాయి ధరమ్ తేజ్ దాదాపుగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోమాలో సుమారుగా 12 రోజుల పాటు ఉన్న సాయి ధరమ్ తేజ్, ఆ తర్వాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని ‘విరూపాక్ష’ చిత్రం చేసాడు. ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా ఈనెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూస్ లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం తానూ ‘సత్య’ అనే షార్ట్ ఫిలిం చేసానని. ఈ చిత్రానికి నవీన్ దర్శకత్వం వచించాడని, త్వరలోనే యూట్యూబ్ లో విడుదల అవ్వబోతుంది అని చెప్పుకొచ్చాడు. హీరో రేంజ్ ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇలా షార్ట్ ఫిలిమ్స్ చెయ్యడం ఏమిటని అభిమానులు వాపోతున్నారు. ఏంటి బ్రో షార్ట్ ఫిలిం ఏమైనా వెబ్ సిరీస్ ఆ ఇలా చేశారు అంటున్న ప్రేక్షకులు.. చూడాలి ఆ షార్ట్ ఫిలిం ఎలా ఉంటుందో మరి..

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus