Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

  • June 23, 2026 / 04:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గాసిప్” (Gossip). నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ చేయగా జై కుమార్ ఎడిటింగ్ చేశారు. రవివర్మ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు నటించగా ఈ నెల 26న విడుదలకు సిద్ధమవగా ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా ఈ చిత్ర లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నటుడు మహేష్ యడ్లపల్లి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సాయి కిరణ్ అడివి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుత సమాజంలో చూస్తున్న కొన్ని సంఘటనలకు దగ్గరగా ఉన్న ఒక విషయాన్ని సినిమాగా చేశాము. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన వైభవ్ గారికి, యతి గారికి థాంక్స్. రాశి సింగ్ గారితో పని చేయడం సంతోషకరం. శక్తికాంత్ కార్తీక్ గారు సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు గురు చరణ్ మాట్లాడుతూ… “గాసిప్ చిత్రం కోసం నాకు వైభవ్ గారు కాంటాక్ట్ చేశారు. నా క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాత ఆయన చేసిన ఆడిషన్ నాకు ఛాలెంజ్ గా అనిపించింది. షూటింగ్ కూడా చాలా త్వరగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయింది. వైభవ్ గారికి ఏం కావాలో మంచి క్లారిటీ ఉంది. ఆయన ఆర్టిస్ట్ లకు ఇచ్చే గౌరవం కూడా అలాగే ఉంటుంది. నిర్మాత యతి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. నటీనటులు అందరూ బాగా కలిసిపోయారు” అన్నారు.

నిర్మాత యతి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని, మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న సాయి కిరణ్ అడివి గారికి స్పెషల్ థాంక్స్. దర్శకునికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి ప్రత్యేకత ఉన్న దర్శకుడు వైభవ్. వైభవ్ చాలా ఫాస్ట్ గా పని చేస్తారు. ఒక మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. వైభవ్ ఎడిట్ వెర్షన్ తెలిసిన దర్శకుడు. ఒక మంచి విషయం వెంటనే వెళ్ళాడు కాని చెడు విషయం వేగంగా వెళుతుంది. ఈ సినిమా అటువంటి విషయాలను తీసుకుని చేసింది. నా పాత్ర సమాజం పట్ల ఒక వ్యక్తి చేసే చర్యలకు ఎఫెక్ట్ చూపించేలా ఉంటుంది. ఒకప్పటి గొప్ప దర్శకులు ఎలా కష్టపడి గొప్ప సినిమాలు ఇచ్చారో వైభవ్ కూడా అలాగే గొప్ప సినిమా ఇస్తున్నారు. దర్శకునికి కావలసిన అన్ని గుణాలు ఉన్న వ్యక్తి. సినిమా విజయానికి మీడియా వారు సపోర్ట్ చేయాలి, ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

అతిథిగా హాజరైన దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ… “వైభవ్ నాకు ఎంతోకాలం నుండి పరిచయం ఉన్న వ్యక్తి, చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. నాకు ఈ ఈవెంట్ కోసం పిలిచే వరకు నాకు ఈ సినిమా చేస్తున్నట్లు తెలీదు. వేరే వారి సహాయం లేకుండా అంతా తన స్వయం కృషితో చేసుకున్నాడు. స్టేజ్ పై ఉన్న కొంత మందితో గతంలో కలిసి పని చేశాను. ఈ చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నా తొలి చిత్రం “గాసిప్”కు మీరు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు. ఈ సినిమాకు నేను రచయితగా, దర్శకుడిగా పని చేశాను. మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే. కానీ మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నా జీవితంలో, నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు కూడా ఉన్నాయి. మాటకు చాలా శక్తి ఉంది. ఒక మాట మనిషిని నిలబెట్టగలదు, అదే మాట అతడిని కూల్చగలదు. అందుకే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతతో ఉండాలి అనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. ఈ సినిమా కోసం కష్టపడ్డ నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను నమ్మి ఈ సినిమా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. “గాసిప్” కేవలం ఒక సందేశాత్మక చిత్రం మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆలోచింపజేసే భావోద్వేగ ప్రయాణం. అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమా ట్రైలర్, పాట విడుదల చేసి మాకు మద్దతుగా నిలిచిన సాయి కిరణ్ గారు, వంశీ గారు, పృథ్వీరాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎప్పుడూ నన్ను, మా సినిమాలను ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. “గాసిప్” సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఒక చిన్న గాసిప్ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చూపించే కథ ఇది. ఇది నా తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో నాకు చాలా బాధ్యతగా, కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు వైభవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకంటే ఆయనకే నాపై ఎక్కువ నమ్మకం ఉండేది. నిర్మాత యతి గారు కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు అవసరమైన అన్ని వనరులు అందించారు. మా డీవోపీ సతీష్ గారు, సహనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ సినిమాలో నేను నటిగా మాత్రమే కాకుండా, డ్యాన్స్ విషయంలో కూడా కొత్తగా ప్రయత్నించాను. అందుకు సహకరించిన ఫాల్గుణి మాస్టర్, సునీల్ మాస్టర్‌లకు ధన్యవాదాలు. ఈ సినిమా మొత్తం టీమ్ కృషితో రూపొందింది. జూన్ 26న విడుదల అవుతున్న “గాసిప్” చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

నటీనటులు : రాశి సింగ్, రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు

సాంకేతిక సిబ్బంది :
రచయిత – వైభవ్ కౌండిన్య
నిర్మాత – ఏతి రేమెళ్ల
బ్యానర్ – వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్
సంగీత దర్శకుడు – శక్తికాంత్ కార్తీక్
డిఓపి- సతీష్
ఎడిటర్ – జై కుమార్
సహ నిర్మాత – నరసింహం తెలనాకుల
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
పిఆర్ఓ: మధు వి ఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gossip
  • #Rashi Singh
  • #ravi varma

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 days ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 days ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version