భారీ…’మల్టీస్టారర్’కు రంగం సిద్దం!!!

ఇది గుడ్ న్యూస్…కాదు కాదు, సూపర్ న్యూస్…కాదంటే కాదు…అటు ఘట్టమనేని, ఇటు నందమూరి వంశ అభిమానులు పండగ చేసుకునే న్యూస్…. ఇంతకి ఏంటి ఆ న్యూస్ అంటే…ఈ కధ చదవండి…అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ ఒకరికొకరు వరుస సినిమాలతో వారి అభిమానులను అలరించారు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఏమీ లేనప్పటికీ, సినిమాల విషయంలో మాత్రం చాలా పోటీ ఉండేది. అదలా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణం అయితే లేదు కానీ,  ప్రతీ హీరో తమ తమ టాలెంట్ తో దూసుకుపోతున్నారు…

ఇప్పుడున్న టాప్ హీరోల్లో మహేష్ బాబుకి, నందమూరి బాలకృష్ణకి ఉన్న క్రేజ్ అంతా ఉంటా కాదు, ఎవరికి వారు తమ సినిమాలతో అభిమానులని అలరిస్తున్నారు. యంగ్ హీరోగా మహేష్, సీనియర్ హీరోగా బాలయ్య సూపర్ హిట్స్ ఇస్తూ దూసుకెళుతున్న తరుణంలో వీళ్ళిద్దరితో ఒక మల్టీస్టారర్ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది ఒక నిర్మాతకు… ఇంతకీ ఎవరా నిర్మాత అంటే..ఎవరో కాదు మన సాయి కొర్రపాటి…ప్రస్తుతం ప్రిన్స్, మురుగదాస్ సినిమాతో బిజీ అవనున్నాడు.

ఇక బాలకృష్ణ శాతకర్ణి సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమాకు అవకాశం లేదు. అయితే ఈ ‘మల్టీస్టారర్’ అనే సినిమా ఎప్పటికీ పట్టాలు ఎక్కుతుందో తెలీదు కానీ, ప్రస్తుతానికి అయితే ఇది ఒక రూమర్ గానే కనిపిస్తుంది….కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతే మాత్రం….అటు నందమూరి, ఇటు ఘట్టమనేని అభిమానులకు పండగే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus