తెలుగు సినిమాలలో నటించిన అందాల భామలు ఎంతో మంది హీరోయిన్లు గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు. కానీ, కొంత మంది హీరోయిన్లు సంపాదించుకున్న అభిమానం మాత్రం చాలా స్పెషల్. అటువంటి జాబితాలోకి వచ్చే ఈ తరం హీరోయిన్లలో మొదటి వరుసలో ఉంటారు హీరోయిన్ సాయి పల్లవి.కొన్ని వేదికలపై స్టార్ డైరెక్టర్లే ఈమెను లేడీ పవర్ స్టార్ గా పేర్కొన్నారు అంటే ఈమె ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అంతటి అభిమానం తను సొంతం చేసుకుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. పూర్తిగా క్లీన్ ఇమేజ్ తో ఎటువంటి కాంట్రవర్సియల్ మూవీస్ లో తల దూర్చకుండా, మంచి కదాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది సాయి పల్లవి. దాంతో పాటు తనకు మాత్రమే సొంతమైన అద్భుతమైన డాన్సులతో మైమరిపిస్తుంది ఈ భామ. ఇది ఇలా ఉండగా, పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రానికి సంబందించిన సీక్వెల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందంటూ ఒక వార్త ఆన్లైన్లో తెగ హల్చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898’. ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నే కాకుండా, సినీ అభిమానుల అంచనాలను సైతం అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటించగా, రెండవ భాగం నుంచి తాను తప్పుకుంటున్నట్టు పోయిన సంవత్సరమే అధికారికంగా కన్ఫర్మ్ చేసారు చిత్ర యూనిట్. అప్పటి నుంచి ఆ క్యారెక్టర్లో ఎవరు నటించబోతున్నారనేది సినీ ప్రేక్షకుల మదిలో మెదులుతున్న బిగ్గెస్ట్ క్వశన్. ఈ ప్రశ్నలన్నిటికీ తెరదించే రోజు దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. హీరోయిన్ సాయి పల్లవి , కల్కి సీక్వెల్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్లు త్వరలోనే ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఆఫిసియల్ గా ప్రకటన చేయబోతున్నట్టు వినికిడి. ఈ రుమర్స్ నిజం అవ్వాలని అటు ప్రభాస్ ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.