Sai Pallavi: బాలీవుడ్ లో కూడా సాయి పల్లవి బిజీబిజీగా..!

సాయిపల్లవి (Sai Pallavi).. ఈ పేరు వినగానే ప్రేక్షకుల మనసులో అందం, అభినయం, నేచురల్ నటన అనేవి వెంటనే గుర్తొస్తాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో, తమిళంలో వరుసగా హిట్ సినిమాలు అందుకున్నా ఎప్పుడూ గ్లామర్ రోల్స్ లో కనిపించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆమె దృష్టి పూర్తిగా బాలీవుడ్ పై పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ రెండు పెద్ద ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రూపొందుతున్న రామాయణ ప్రాజెక్ట్ లో సీత పాత్రలో నటిస్తోందట.

Sai Pallavi

ఈ సినిమా కోసం ఆమె బల్క్ డేట్లు ఇచ్చిందని, షూటింగ్ కూడా వేగంగా సాగుతోందని ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తోంది. సీత పాత్రలో ఆమె కచ్చితంగా తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ తో మరో సినిమాను సైన్ చేసింది. జునైద్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ కొంతకాలంగా వాయిదా పడుతుండగా, ఇప్పుడు మళ్లీ స్పీడ్ గా జరుగుతోందట. ఇటీవల జునైద్ ఖాన్ నటించిన లవ్ యాపా ఫ్లాప్ కావడంతో, ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఆమీర్ ఖాన్ తన కొడుకు జునైద్ పై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ సినిమా అతని కెరీర్ కు మలుపు తిప్పుతుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పాడు.

జునైద్ నటనపై ఎలాంటి సందేహం లేదని, రాబోయే రోజుల్లో అతను స్టార్ హీరో అవుతాడనే ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి లాంటి పర్ ఫెక్ట్ హీరోయిన్ తో జతకడుతుండటం, సినిమాకు మరింత బలాన్ని ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి బాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా, అక్కడ సక్సెస్ సాధిస్తే తిరిగి సౌత్ లోనూ ఆమె క్రేజ్ పెరగడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఆమె నటిస్తున్న ఈ హిందీ సినిమాలు తెలుగులో, తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచన కూడా ప్రొడ్యూసర్స్ లో ఉందట. మొత్తానికి సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ బిజీగా తన ప్రత్యేకతను చాటుతోంది. మరి, ఈ రెండు ప్రాజెక్ట్స్ ఆమె కెరీర్ ను ఏ స్థాయికి తీసుకు వెళతాయో చూడాలి.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus