Ram Charan: చరణ్‌ కొత్త సినిమాలో తెగని హీరోయిన్‌ వెతుకులాట.. కొత్త పేరు చర్చల్లోకి!

  • November 18, 2023 / 03:27 PM IST

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా.. ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు లీకులు లేకుండా ఆ సినిమాను అనౌన్స్‌ చేసేశారు. అయితే అప్పటి నుండి మొదలుపెట్టిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే ఈ క్రమంలో సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. అలా కథానాయిక విషయంలో చర్చలు తుది దశకు వచ్చాయి అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సహజ నటిని కథానాయికగా ఎంచుకుంటారని టాక్‌.

అప్పటి తరం వాళ్లకు సహజ నటి అంటే జయసుధ అయితే… ఇప్పటి తరం వాళ్లకు ఆ బిరుదు వినగానే గుర్తొచ్చేది సాయిపల్లవి. అవును ఆమెను కథానాయికగా ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. కథలో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకం అని, అందుకే ఆమెనే కథానాయికగా ఎంపిక చేయాలని దర్శకుడు బుచ్చిబాబు సానా అనుకుంటున్నారట. అయితే మరి ఈ ప్రాజెక్ట్‌కు సాయిపల్లవి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

ప్రస్తుతం సాయిపల్లవి ముంబయిలో ఉంది. రణ్‌బీర్‌ కపూర్‌తో చేస్తుంది అని టాక్‌ నడుస్తున్న ‘రామాయణం’ కోసం అక్కడ సాయిపల్లవి డిస్కషన్స్‌ జరుపుతోందని చెబుతున్నారు. ఆ సినిమా ఒప్పుకుంటే ఇంకే సినిమా కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు అని చెబుతున్నారు. అయితే ఆ సినిమాకు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈలోపు చరణ్‌ సినిమా చేసేయొచ్చు అనే ఆలోచన కూడా ఉందట. అయితే ఈ విషయంలో క్లారిటీ కావాలి.

(Ram Charan) చ‌ర‌ణ్ 16వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తారు. అలాఏగ ఈ సినిమాలో క‌థానాయిక విష‌యంలో చాలా పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అందులో జాన్వీ క‌పూర్, కీర్తి సురేష్‌, రాషా టాండ‌న్ లాంటి పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురూ కాదని సాయిపల్లవిని అనుకుంటున్నారు. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ఒకరు సాయిపల్లవి అయితే… ఇంకొక అమ్మాయి బాలీవుడ్ నుండి వస్తుంది అని చెబుతున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus