Sai Tej: మెగా హీరో సాయితేజ్ మంచి మనస్సుకు హ్యట్సాఫ్ అనాల్సిందే!

మెగా హీరోలలో సాయితేజ్ (Sai Dharam Tej) రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఈ మధ్య కాలంలో విరాళాలు అందించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సాయితేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో ఫోటోలు దిగడంతో పాటు ముచ్చటించారు. సాయితేజ్ ఫౌండేషన్ కోసం 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించి గొప్ప మనస్సును చాటుకున్నారు.

Sai Tej

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళం ప్రకటించిన సాయితేజ్ కొన్నిరోజుల క్రితం బెజవాడలోని ఒక ఆశ్రమం కోసం తన వంతు సహాయం చేశారు. సాయితేజ్ ప్రతి సందర్భంలో తన వంతు సహాయం చేయడానికి ఆసక్తి చూపిస్తూ వార్తల్లో నిలుస్తుండటం కొసమెరుపు. సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

సాయితేజ్ రెమ్యునరేషన్ సైతం 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. విరూపాక్ష (Virupaksha) సినిమాతో సక్సెస్ సాధించడం సాయితేజ్ కు ఎంతగానో ప్లస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సాయితేజ్ విరూపాక్ష సీక్వెల్ లో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఈ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సి ఉంది.

సాయితేజ్ విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సాయితేజ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సాయితేజ్ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సాయితేజ్ మెగా హీరోలతో కలిసి మరిన్ని మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మెగా హీరోలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus