ఇతిహాసాల ఆధారంగా, జీవిత కథల నేపథ్యంలో సినిమాలు తీస్తే వివాదాలు రావడం కొత్త విషయమేమీ కాదు. కథ బాగోలేదనో, కథను తప్పుగా చూపిస్తున్నారనో, ఆ పాత్రను తప్పుగా చూపిస్తున్నారనో, లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారనో… వాదనలు, చర్చలు, వివాదాలు, నిరసనలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌లో ఈ పద్ధతి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటుంది. తెలుగులోనూ ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కవవుతున్నాయి. దీనికి ఆయా సినిమాల నటులు, చిత్రబృందం చెప్పే మాటలు కూడా కారణం కావొచ్చు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా మీద ప్రస్తుతం విమర్శలు, కేసులు నడుస్తున్నాయి. తాజాగా ఓ న్యాయవాది సినిమా మీద కేసు వేశారు. ఇంతకీ ఏమైందంటే?
ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ‘ఆది పురుష్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే ‘‘రాముడితో రావణుడు యుద్ధం చేయడం సరైనదే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని ‘ఆదిపురుష్’లో చూపిస్తాం’’ అంటూ మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా ఆయన మీద, సినిమా మీద తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆఖరికి సైఫ్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే.. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సైఫ్ క్షమాపణలు చెప్పేశాడు కదా అని వదలకుండా… ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది సినిమాపై జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్ వేశాడు. రావడణుడు విషయంలో సైఫ్ వ్యాఖ్యలు మత విశ్వాసాన్ని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సైఫ్‌తో పాటు, దర్శకుడు ఓం రౌత్ పేరును కూడా పిటిషన్‌లో చేర్చాడు.
ఇలాంటి ఒకటి రెండు పిటిషన్ల వల్ల సినిమాకొచ్చిన పెద్ద కష్టం ఏమీ ఉండనప్పటికీ… సైఫ్ చెప్పినట్లుగా ఒకవేళ రావణుడుని అలా చూపిస్తే ఇబ్బందులు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణ మొదలయ్యాక వచ్చే లీకుల సమాచారంతో ఇలాంటి కేసులు పెరిగే అవకాశమూ లేకపోలేదనేది ఓ వాదన. మరి చిత్రబృందం దీనిపై స్పందించి సినిమా ఉద్దేశం అది కాదు అని చెబుతుందా? లేక కథలు మార్పులు చేస్తామని చెబుతుందా అనేది తెలియాలి. లేక ఇలాంటి వ్యాఖ్యల సెగలు మరిన్ని తాకే ప్రమాదం ఉంది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!