Saif Ali Khan, Jr NTR: వైరల్ అవుతున్న సైఫ్ అలీఖాన్ షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీలో సైఫ్ రోల్ పవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కొరటాల శివ మూడు గంటల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పారని తన రోల్ గురించి కొరటాల అద్భుతంగా చెప్పారని సైఫ్ అన్నారు. కొరటాల శివ ఈ మూవీ కోసం అద్భుతమైన ప్లానింగ్, సెటప్ చేశారని సైఫ్ అలీఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తారక్ ఫ్రెండ్లీ, చార్మింగ్ గా అనిపించాడని ఆయన తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ వర్క్ విషయంలో పాషనేట్ గా ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తుండటం గమనార్హం.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ గ్లామరస్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ కు ఈ సినిమా కచ్చితంగా కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్, జాన్వీ జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus