సెన్సార్ కార్యక్రమాల్లో సువ‌ర్ణ‌సుంద‌రి

Advertisement

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “సువర్ణసుందరి”. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె‌ విడుదలైన థియెరటికల్ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది. లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. దానికి నిదర్శనం మా చిత్ర ట్రైలర్ ‌కు వచ్చిన రెస్పాన్స్ . సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. మూడు జన్మల కాన్సెప్ట్ తో హిస్టారికల్ థ్రిల్లర్ గా తీసిన ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. మార్చి తొలివారంలో పాటలను రెండొ వారంలొ సినిమాను తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ ఒకేసారి విడుదల చెయటానికి నిర్మాత సన్నాహాలు చెస్తున్నారన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus