Prashanth Neel: ఆ ఒక్క విషయంలో రాజమౌళి కంటే ప్రశాంత్ గ్రేట్.. ఎందుకంటే?

  • December 27, 2023 / 04:34 PM IST

సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ప్రశాంత్ నీల్ 5 రోజుల్లో సలార్ సినిమాతో 242 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. మరో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే రాజమౌళితో పోలిస్తే ఒక విషయంలో ప్రశాంత్ నీల్ గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాను వేగంగా సెట్స్ పైకి తీసుకెళుతూ వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. రాజమౌళి మాత్రం ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగేళ్ల సమయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో జక్కన్న మారాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రాజమౌళి మహేష్ కాంబో మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. 2026 సంవత్సరం లేదా 2027 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

రాజమౌళి ఈ సినిమా కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో, భారీ లెవెల్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. జక్కన్న భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జక్కన్న కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus