Salaar: సలార్ తెలుగు రాష్ట్రాలలో థియేట్రిక‌ల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!

ప్ర‌భాస్ స‌లార్ మూవీకి సెప్టెంబ‌ర్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ రిలీజ్‌కు నెల రోజులు టైమ్ ఉండ‌గానే థియేట్రిక‌ల్‌తో పాటు డిజిట‌ల్‌, శాటిలైట్ బిజినెస్ దాదాపు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్‌కోసం ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది. తెలుగు రైట్స్ దాదాపు 200 కోట్ల‌కుపైనే అమ్ముడుపోయే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రిక‌ల్ రైట్స్ ద‌క్కించుకునేందుకు నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌ దిల్‌రాజు పోటీప‌డుతోన్న‌ట్లు తెలిసింది.

నైజాం రైట్స్ కోసం 80 కోట్ల వ‌ర‌కు చెల్లించ‌డానికి దిల్‌రాజు రెడీ అయిన‌ట్లు చెబుతోన్నారు. దిల్ రాజుతో పాటు మ‌రో రెండు టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజెస్ పోటీలోకి రావ‌డంతో ఈ రేటు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. వంద కోట్లు దాటే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మంగ‌ళ‌వారం రోజు నైజాం ఏరియా థియేట్రిక‌ల్ రైట్స్‌పై క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు డిజిట‌ల్ రైట్స్ కోసం 100 కోట్ల‌కుపైనే చెల్లించ‌డానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

స‌లార్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది ప్ర‌భాస్ అభిమానుల‌తో సినిమా ల‌వ‌ర్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబ‌ర్ 7న ముంబ‌యిలో ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌పై కూడా మ‌రో ఒక‌టి, రెండు రోజుల్లో క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. ఈ ఈవెంట్‌కు ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, ద‌క్షిణాది సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకాబోతున్న‌ట్లు చెబుతోన్నారు. స‌లార్ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. జ‌గ‌ప‌తిబాబు, శృతిహాస‌న్‌, టీనూ ఆనంద్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus