Prabhas: ఫ్యాన్స్ ముచ్చట తీర్చే పనిలో ‘సలార్’ టీం?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. జూన్ 16 న విడుదల కాబోతోంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది. అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. యూట్యూబ్ లో ఈ మూవీ ట్రైలర్ 120 మిలియన్ వ్యూస్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది. ‘జై శ్రీరామ్’ అనే పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంది.

సో రిలీజ్ టైంకి వచ్చేసరికి ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ అయితే ఏర్పడింది. కానీ ఇలాంటి మైథలాజికల్ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ అయితే ఉండరు. పైగా ఇది అందరికీ తెలిసిన సీతారాముల కథే. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని భారీ సంఖ్యలో వెళ్లి చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ ‘ఆదిపురుష్’ కి భారీ బిజినెస్ జరుగుతుంది. అందుకే ఈ చిత్రంతో పాటు ‘సలార్’ గ్లిమ్ప్స్ ను కూడా విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

గతంలో ‘బాహుబలి 2 ‘ టైంలో ‘సాహో’ గ్లిమ్ప్స్ ను వదిలారు. దీంతో మొదటి నుండి ‘సాహో’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాని ఫలితంగా ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీలో ఆ మూవీ సేఫ్ అయ్యింది. అన్నిటికీ మించి ప్రభాస్ అభిమానులు హ్యాపీ. అందుకే ‘ఆదిపురుష్’ తో పాటు ‘సలార్’ గ్లిమ్ప్స్ ను వదిలితే ఆ ఇంపాక్ట్ డబుల్ ఉంటుంది అన్నది అభిమానుల మాట.

వారి కోరిక మేరకే ‘సలార్’ టీం కూడా ‘ఆదిపురుష్’ తో పాటు ‘సలార్’ గ్లిమ్ప్స్ వదలడానికి రెడీ అయ్యింది. బ్లాక్ అండ్ బ్లాక్ లో ప్రభాస్ జస్ట్ అలా నడిచొచ్చే 30 సెకన్ల మాస్ అండ్ స్టైలిష్ వీడియో ఇదని తెలుస్తుంది. అదే నిజమైతే (Prabhas) ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ‘సలార్’ చిత్రం సెప్టెంబర్ 28 న విడుదల కాబోతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus