ఎయిర్ పోర్ట్ లో చైసామ్ ఫోటోలు వైరల్!

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత వారం రోజుల పాటు వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న చైతు పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ మాల్దీవులకు వెళ్లారు. అక్కడే ఇన్ని రోజులు ఉన్నారు. భర్త పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించింది సామ్. అంతేకాదు.. గ్లామరస్ గా ఫోటోలకు ఫోజిలిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. బాత్ టబ్ లో సామ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ జంట వెకేషన్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి చేరుకున్నారు.

ఎయిర్ పోర్ట్ లో దిగిన నాగ చైతన్య, సమంతల ఫోటోలు బయటకి వచ్చాయి. ఈ ఫోటోలలో కూడా సామ్ గ్లామరస్ గా కనిపిస్తోంది. వెకేషన్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ కానున్నారు. ప్రస్తుతం చైతు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు నటిస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

దీని తరువాత తన తదుపరి సినిమాల కోసం చైతు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోపక్క సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీ కానుంది. ‘ఆహా’లో సామ్ జామ్ అనే టాక్ షోని హోస్ట్ చేస్తోంది సమంత. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటిలను ఇంటర్వ్యూ చేసిన సామ్ మరింత మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనుంది.

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus