సాహసోపేతమైన పాత్రలో సమంత!

టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఓ నటిని తల్లి పాత్రలో కనిపించాలని అడిగితే.. ఆమె కొచ్చే కోపానికి హద్దులుండవు. డీ గ్లామర్ గా నటించడానికి ఒప్పుకుంటారేమోగానీ వయసు పెరిగిన వ్యక్తిలా నటించమంటే నో అని చెబుతుంటారు. ప్రస్తుతం దక్షిణాదిన టాప్  హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతున్న సమంత మాత్రం బామ్మ పాత్రలో నటించడానికి ఇష్టపడుతోంది.  ప్రస్తుతం సమంత “యూ టర్న్” సినిమాని తెలుగు, తమిళ భాషల్లో చేస్తోంది. ఇది ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.  డైరక్టర్ త్యాగరాజన్‌ దర్శకత్వంలో  “సూపర్‌ డీలక్స్‌”,  శివ కార్తికేయన్ తో సీమ రాజా అనే మూవీలో నటిస్తోంది. భర్త నాగ చైతన్యతో కలిసి ఓ మూవీ చేస్తోంది.

రీసెంట్ గా ప్రారంభమైన ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇలా ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కథలను వినడానికి టైం కేటాయిస్తోంది. ఈ మధ్య నందిని రెడ్డి సమంతకి ఓ కథ చెప్పారంట. 2014లో వచ్చిన కొరియన్ మూవీ “మిస్ గ్రానీ” స్పూర్తితో కథ రాసుకున్నారు. అతీత శక్తులను కలిగి యువతిగా మారిపోయే వృద్ధురాలి పాత్ర చుట్టూ కథ సాగుతుంది. ఆ పాత్రని మెచ్చిన సమంత వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. స్క్రిప్ట్ తెలుగు వారికీ తగ్గట్టు నందిని రెడ్డి మలచగలిగితే ఈ ప్రాజక్ట్ పట్టాలెక్కడం ఖాయమని ఫిలిం నగర్ వాసులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus