Samantha: పెళ్లయ్యాక సమంతలో ఈ మార్పు ఎందుకో

పెళ్లి చేసుకున్నాక హీరోయిన్లు నటనకు దూరమవ్వాలా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు, ఆమె భర్తకు నచ్చితే ఆమె హీరోయిన్‌గా కొనసాగొచ్చు. అయితే ఇలా హీరోయిన్‌గా కంటిన్యూ అయినవాళ్లు బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. మన దగ్గర అలాంటి నాయికలు కష్టం. ఒకవేళ కొనసాగినా పెద్దగా అవకాశాలు రావు. వచ్చిన పద్ధతైన పాత్రలు చేస్తామని వారు అనడమో, పెళ్లయిపోయింది కాబట్టి మునపటిలా గ్లామర్‌ పాత్రలు చేయదనో దర్శకులు ముందుకు రారు. అయితే వీటన్నింటినీ పక్కనపెట్టిన నాయిక సమంత.

2017 అక్టోబరులో సమంత… నాగచైతన్య వివాహం జరిగింది. ఆ తర్వాత సమంత సినిమాలు చేయడం తగ్గించింది. పెళ్లి అయిపోయింది కదా… ఇక సినిమా క్రమేణా తగ్గించి ఆపేస్తుందేమో అని అందరూ అనుకున్నారు. అయితే సమంత గ్యాప్‌ ఇచ్చింది అందుకు కాదు… తనలోని మరో యాంగిల్‌ చూపించడానికి అని అర్థమవ్వడానికి ప్రేక్షకులకు ఎంతసేపో పట్టలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సామ్‌ దూకుడు చూస్తే మతిపోతుంది. అయితే అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం కాస్త అటుఇటుగా ఉంటుంది.

సమంత ఆఫ్టర్‌ మ్యారేజ్‌ఎంచుకుంటున్న పాత్రలే అభిమానుల మూతివిరుపునకు కారణమట. పెళ్లయ్యాక ఆమె చేసిన పాత్రలు చూస్తే… ‘సామ్‌ ఇలాంటి పాత్రలు ఒప్పుకుందంటే… నమ్మరు’. ‘రంగస్థలం’లో సమంత లిప్‌లాక్‌ సీన్‌ ఉంటుంది. దాంతోపాటు కూసింత ఎక్స్‌పోజింగ్‌ కూడా చేసింది. ఆ తర్వాత ‘సూపర్‌ డీలక్స్‌’లోనూ అదే పరిస్థితి. పెళ్లయ్యాక పాత బాయ్‌ ఫ్రెండ్‌తో సంబంధం పెట్టుకునే పాత్ర అందులో చేసింది. ఇప్పుడు ‘శాకుంతలం’ చేస్తోంది. అందులో పద్ధతైన రొమాన్స్‌ ఉండనుందని సమాచారం.

ఇదంతా సినిమాలు… అయితే సమంత తొలిసారి వెబ్‌సిరీస్‌ రంగంలోకి వచ్చి చేసిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’. అందులో సమంత పాత్రకు మంచి పేరు వస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమె డేరింగ్‌ స్టెప్‌ చూసి అభిమానులు ‘మరీ ఇంత బోల్డ్‌ ఆఁ..’ అంటున్నారు. ఈ సిరీస్‌లో సమంత రెండుసార్లు బోల్డ్‌నెస్‌ చూపించింది. ఒకసారి బ్రాతో కనిపిస్తుంది. శృంగార సన్నివేశంలో పాల్గొంటుంది. మరో సందర్భంలో శృంగార సన్నివేశం వచ్చినా… దానిని చూపించరు. కానీ అదే క్రమంలో ఆమె బాడీ లాంగ్వేజ్‌లో బోల్డ్‌నెస్‌ కనిపిస్తుంది. ఇదన్నమాట… సమంత బోల్డ్‌ మేటర్‌. మరి ఇలాంటి పాత్రలు సమంత ఎందుకు చేస్తోంది. నాకు ధైర్యం ఎక్కువ అని చెప్పడానికా.. లేక పాత్ర కోసం ఎందాకైనా వెళ్లడానికి రెడీ అని చెప్పడానికా.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus