వెడ్డింగ్ గోల్స్ లో మరో గోల్ పూర్తి చేసిన సమంత!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత డెడికేషన్, హార్డ్ వర్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినీ నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నడుచుకుంటూ శెభాష్ అనిపించుకుంటోంది. ఆమె డెడికేషన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే..  నాగచైతన్య, సమంత ప్రేమించుకుని, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అక్టోబర్ 6 న గోవాలో వీరి పెళ్లి జరగనుంది. ఈ డేట్ ఫిక్స్ చేసే సమయం నాటికీ సమంత చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 ,  రాజుగారి గది-2 , మహానటి కోసం డేట్స్ కేటాయించింది.

దీంతోపాటు తమిళంలో విజయ్ హీరోగా నటించే 61, ఇరుంబు తిరాయ్, అనేతి కథైగల్ సినిమాల్లో సమంత కథానాయికగా సైన్ చేసింది. ఈ సినిమాలన్నీ నాలుగు నెలల్లో విశ్రాంతి తీసుకోకుండా పెళ్ళికి ముందే పూర్తిచేయాలని ఫిక్స్ అయింది. అది జరిగే పనేనా? అందరూ అనుకున్నారు. కానీ సమంత మాత్రం తొలుత రాజుగారి గది-2 ని కంప్లీట్ చేసింది. తాజాగా రంగస్థలం సినిమాని కూడా పూర్తి చేసినట్లు డైరక్టర్ చెప్పారు. తెలుగులో ఇంకా మహానటి మాత్రమే ఉంది. తమిళ సినిమాలను కూడా పెళ్లి ముహూర్తానికి పది రోజుల ముందే పూర్తి చేసి దట్ ఈజ్ సమంత అని నిరూపించుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus