ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసిన సమంత, సామ్ తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పిన ఉపాసన

యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కోసం సెలబ్రిటీ వైవ్స్ సమంత, ఉపాసన కలిసి పనిచేస్తున్నారు. సమంత చక్కటి హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తోంది. ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసింది. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్ గా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని ఎంచుకుంది. తను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది.

ఉపాసన, సమంత వంట చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఉపాసన మాట్లాడుతూ సమంత తనకు ఇన్సిపిరేషన్ అన్నారు. సమంత హెల్దీ ఫిట్ ఫుల్ ఫిల్లింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటారని చెప్పారు. ఉపాసన అలా చెబుతుంటే సమంత టీజింగ్ గా నవ్వింది. తమ ఇంట్లో కూడా ఇడ్లీ మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ ఫాస్ట్ లా తీసుకుంటామని చెప్పింది. ఉపాసన తనతో ఛాట్ చేస్తూ ఉంటే, సమంత చకచకా ఓట్స్ , క్యారెట్ ఇడ్లీ చేసేసింది. ఆ ఇడ్లీని టేస్ట్ చేశారు ఇద్దరు. సమంత ఓట్స్ క్యారెట్ ఇడ్లీ రుచి చూశాక ఇలాంటి ఇడ్లీలైతే నేను రోజూ తింటానని చెప్పింది. యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కు సమంత గెస్ట్ ఎడిటర్ గా తన హెల్దీ టిప్స్ పంచుకుంటోంది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus