సమంతకు పెద్ద షాక్ ఇచ్చిన ఫ్యాన్..!

తాజాగా సమంతకు ఓ అభిమాని పెద్ద షాక్ ఇచ్చాడు. సమంత ‘బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్’ సర్టిఫికెట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సమంతను ట్యాగ్ చేసాడు. ఈ పోస్ట్ ను చూసి సమంత కూడా ఆశ్చర్యపోయింది. ‘అసలు నా డిగ్రీ సెర్టిఫికెట్’ కు సంబంధించిన ఫోటో నువ్వు ఎలా సంపాదించావు’ అంటూ సమంత అతన్ని ప్రశ్నించింది. సమంత అభిమానులు మాత్రమే కాకుండా ఆమె సన్నిహితులు కూడా ఈ పోస్ట్ ను చూసి ఆశ్చర్యపోయారు.

వాళ్ళు కూడా ఈ పోస్ట్ చేసిన వ్యక్తిని ప్రశ్నించారు. అయితే కొంత టైం గడిచాక.. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి దానిని డిలీట్ చేసాడు. అసలు ఎందుకు పోస్ట్ చేసాడు.. ఆ తరువాత ఎందుకు డిలీట్ చేసాడన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలీలేదు. ఇక ఆ సెర్టిఫికెట్ ప్రకారం.. సమంత 2007 లో తన బ్యాచిలర్ డిగ్రీ ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది సమంత.

తమిళంలో సూపర్ హిట్ అయిన విజయ్ సేతుపతి, త్రిష ల ’96’ అనే సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకులను మాత్రం.. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల తన భర్తతో కలిసి ఇంట్లోనే ఉంటూ వచ్చిందట సమంత. ఇప్పుడు కొన్ని సడలింపులు ఇవ్వడంతో తన మామ నాగార్జున .. అత్త అమలను కలుస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.

1

2


Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus