సమంత ఫ్యాన్స్ కి చేదు అనుభవం..!

  • March 12, 2018 / 12:27 PM IST

హీరోలంటే అభిమానం ఉంటే.. హీరోయిన్లంటే మాత్రం ఎందుకో అభిమానానికి మించినదేదో ఉంటుంది. అందుకే హీరోహీరోయిన్లను కలవడం కోసం అభిమానులు నానా తంటాలు పడుతుంటారు. ఒక్కోసారి తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ని కలవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. ఒక్కోసారి సక్సెస్ ఫుల్ గా కలిసి తమకు ఇష్టమైన హీరో/హీరోయిన్ తో ఫోటోలు సంపాదిస్తారు కొందరు, కానీ.. ఒక్కోసారి అభిమానంతో చేసే పనులు చేదు అనుభవాన్ని మిగుల్చుతుంటాయి.

తాజాగా అనంతపురంలో అలాంటి సంఘటనే చోటు చేసుకొంది. ఓ సమంత అభిమాని ఒక మొబైల్ షాప్ ఓపెనింగ్ కోసం ఈ రోజు ఉదయం వచ్చిన తన అభిమాన తార సమంత వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తించిన పోలీసులు అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులపై చేయి చేసుకోవటంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆ యువకుడ్ని చితకబాదేశారు.

అనుకోని పరిణామంతో సమంత ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు. కుర్రాడి ఉదంతంతో సీరియస్ అయిన పోలీసులు నిగ్రహం కోల్పోయి.. షోరూం దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో.. పలువురు గాయపడ్డారు. సమంత అనంతపురం జిల్లాకు రావుడేమో కానీ.. ఆమె అభిమానులకు మాత్రం లాఠీ దెబ్బలు బహుమానంగా తగిలాయని చెప్పక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus